Animal Movie : యానిమల్ మూవీలోని రియల్ మెషిన్ గన్ చూశారా..?

యానిమల్ మూవీలోని భారీ మెషిన్ గన్ సీక్వెన్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. మరి ఆ రియల్ మెషిన్ గన్ ని చూశారా..?

Animal Movie : యానిమల్ మూవీలోని రియల్ మెషిన్ గన్ చూశారా..?

Sandeep Reddy Vanga Ranbir Kapoor Animal Movie real machine gun video

Animal Movie : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. నాన్న ఎమోషన్ కి వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ ని జోడించి సందీప్ వంగా డైరెక్ట్ చేసిన తీరు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండురోజు 120 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఓవర్ ఆల్ గా రెండు రోజుల్లో 236 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది.

కాగా ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సందీప్ వంగా ముందు చెప్పినట్లే.. అసలైన వైలెన్స్ అంటే ఏంటో ఈ మూవీలో చూపించేశారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఆ వైలెన్స్ చూసిన ఆడియన్స్ సూపర్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాలో భారీ మెషిన్ గన్ తో ఒక యాక్షన్ సన్నివేశం ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ సీక్వెన్స్ షాట్ ని ట్రైలర్ లో కూడా చూపించారు. కాగా ఆ గన్ ని గ్రాఫిక్స్ ద్వారా చూపించలేదు, నిజమైన స్టీల్ తో తయారు చేసినట్లు మేకర్స్ ఆల్రెడీ తెలియజేశారు.

Also read : RGV – Sandeep Vanga : సందీప్ వంగా పాదాల ఫోటో.. వాట్సాప్ చేయమంటూ ఆర్జీవీ ట్వీట్..

500 కేజీల స్టీల్ తో దాదాపు నాలుగు నెలలు కష్టపడి ఆ మెషిన్ గన్ ని తయారు చేశారట. ఇక సినిమాలో ఈ సీన్ చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మరి ఆ మెషిన్ గన్ సినిమాల్లో కాకుండా బయట ఎలా ఉందో చూశారా..? తాజాగా ఆ రియల్ మెషిన్ గన్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన ఆడియన్స్.. సినిమాలో కంటే రియల్ గా చూస్తూనే ఇంకా చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ రియల్ మెషిన్ గన్ ని మీరు కూడా చూసేయండి.