RGV – Sandeep Vanga : సందీప్ వంగా పాదాల ఫోటో.. వాట్సాప్ చేయమంటూ ఆర్జీవీ ట్వీట్..

సందీప్ రెడ్డి వంగా పాదాలు నాకాలని ఉందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్. యానిమల్ మూవీ పై వర్మ రివ్యూ.

RGV – Sandeep Vanga : సందీప్ వంగా పాదాల ఫోటో.. వాట్సాప్ చేయమంటూ ఆర్జీవీ ట్వీట్..

Ram Gopal Varma review about Sandeep Reddy Vanga Animal movie

Ram Gopal Varma – Sandeep Reddy Vanga : టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలతో ఒక పాత్ బ్రేకర్ గా ఎలా నిలిచారో.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా తన సినిమాలతో మరో పాత్ బ్రేకర్ గా సంచలనం సృష్టిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో లవ్ స్టోరీ సినిమాల్లో ఒక కొత్త యాంగిల్ ని చూపించి మూవీ మేకర్స్ కి సైతం దిమ్మ తిరిగేలా చేసిన సందీప్ వంగా.. యానిమల్ చిత్రంతో మరోసారి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన యానిమల్ ఇండియా వైడ్ రికార్డులు సెట్ చేస్తూ వస్తుంది.

ఇక ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీల్ అవుతూ సోషల్ మీడియా ద్వారా తమ అనుభూతుని తెలియజేస్తున్నారు. విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్, రివ్యూలు చూసిన వర్మ.. రీసెంట్ గా ఈ చిత్రాన్ని చూశారంటా. దీంతో యానిమల్ మీద తన రివ్యూ తెలియజేస్తూ ఒక నోట్ రిలీజ్ చేశారు. ఈ రివ్యూలో వర్మ ఇలా రాసుకొచ్చారు.. “సందీప్ వంగా నీ పాదాల ఫోటోని నాకు వాట్సాప్ చెయ్యి. వాటిని నేను మొక్కాలి అనుకుంటున్నాను” అని రాసుకొచ్చారు.

Also read : Ram Gopal Varma : ఇది కాంగ్రెస్ విజయం కాదు.. రేవంత్ రెడ్డి విజయం.. ఆర్జీవీ ట్వీట్..

అంతేకాదు, సందీప్ వంగా పాదాలకు ఎందుకు నమస్కరించాలని అనుకుంటున్నారో అనేదానికి నాలుగు రీజన్స్ చెప్పుకొచ్చారు.
మొదటిది.. ప్రొఫెషనల్ కెమెరా కనిపెట్టిన నుంచి ఫిలిం మేకర్స్ నమ్మే ప్రతి నియమాన్ని నువ్వు పూర్తిగా బద్దలు కొట్టావు.
రెండోది.. బాలీవుడ్‌లో అయినా, దక్షిణాది చిత్రాల్లో అయినా తమ భవిష్యత్ చిత్రాలకు సంబంధించి ఏదైనా సృజనాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ సినిమాలోని సన్నివేశాలు వారిని వెంటాడుతాయి.
మూడోది.. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ నుండి స్టీవెన్ స్పీల్‌బర్గ్ వరకు, అలాగే ఈనాటి దర్శకులు.. తమ సినిమాల్లో ఒక పాయింట్ ని చెప్పడానికి వీలైనంత తక్కువ నిడివి ఉండాలని విశ్వసిస్తారు. నువ్వు వారి నమ్మకాలని కొట్టిపడేశావు.
నాలుగవది.. ఇప్పటి నుంచి అన్ని భాషల తారలు ఇలాంటి పాత్రలు నటించాలని కలలు కంటారు. దీంతో ఇది కొత్త రచయితలు మరియు దర్శకులను సృష్టిస్తుంది. అలాగే ఇది క్రియేటివిటీ మరియు ఒరిజినాలిటీ కథలు చూపించేలా చేస్తుంది. ఈ సినిమాలో రణబీర్ తన షూ నాకమని అమ్మాయిని అడగడం నచ్చలేదు. కానీ ఆ తరువాత అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్ళినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్ళో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రణబీర్ షాట్ వరకు ప్రతి ఇంచ్ నాకు నచ్చింది. అందుకనే నేను నీ రెండు కాళ్ళు నాకాలని అనుకుంటున్నాను.