Guntur Kaaram : మహేష్ ‘గుంటూరు కారం’.. ఎన్టీఆర్ ‘రాఖీ’.. ఈ పోలిక చూశారా? రెండు సినిమాలకు..

గుంటూరు కారం టైటిల్ కింద ట్యాగ్ 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' అని ఇచ్చారు. అంటే ఎక్కువ ఘాటు, ఎక్కువ మంట ఉంది అని అర్ధం. అయితే మహేష్ టైటిల్ కి ఈ ట్యాగ్ చూశాక ఎన్టీఆర్ రాఖీ సినిమా వైరల్ గా మారింది.

Rakhi : మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిన్న (మే 31న) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా SSMB28 టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఫుల్ మాస్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ గుంటూరు కారం టైటిల్ కింద ట్యాగ్ ‘హైలీ ఇన్‌ఫ్లేమబుల్’ అని ఇచ్చారు. అంటే ఎక్కువ ఘాటు, ఎక్కువ మంట ఉంది అని అర్ధం. అయితే మహేష్ టైటిల్ కి ఈ ట్యాగ్ చూశాక ఎన్టీఆర్ రాఖీ సినిమా వైరల్ గా మారింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి లు నటించిన రాఖీ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అయితే రాఖీ సినిమాకు కూడా ట్యాగ్ ‘హైలీ ఇన్‌ఫ్లేమబుల్’ అని ఉంటుంది.

Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి అప్పటిదాకా ఇంకే అప్డేట్ ఉండదట.. నిరాశలో ఫ్యాన్స్..

దీంతో ఈ రెండు సినిమాల టైటిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆల్రెడీ రాఖీ సినిమాకు ఈ ట్యాగ్ ఉందని తెలిసే గుంటూరు కారం సినిమాకు పెట్టారా? లేకపోతే చేసుకోలేదా? లేక ఈ సినిమాకు కూడా ఆ ట్యాగ్ సెట్ అవుతుందని పెట్టారా అని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్యాగ్ పై చిత్రయూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక ఆ ట్యాగ్ గుంటూరు కారం సినిమాకు ఎంతవరకు సరిపోతుందో తెలియాలి అంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

 

 

ట్రెండింగ్ వార్తలు