Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి అప్పటిదాకా ఇంకే అప్డేట్ ఉండదట.. నిరాశలో ఫ్యాన్స్..

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన మహేష్ పోస్టర్స్, తాజాగా రిలీజయిన గ్లింప్స్, టైటిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Mahesh Babu : మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి అప్పటిదాకా ఇంకే అప్డేట్ ఉండదట.. నిరాశలో ఫ్యాన్స్..

Mahesh Babu Guntur Kaarm Movie no updates up to august said by producer nagavamsi

Updated On : June 1, 2023 / 10:06 AM IST

Guntur Kaaram : మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB28. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిన్న (మే 31న) కృష్ణ పుట్టినరోజు సందర్భంగా SSMB28 టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన మహేష్ పోస్టర్స్, తాజాగా రిలీజయిన గ్లింప్స్, టైటిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇది త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ అప్డేట్ ఇచ్చాక వచ్చే రెండు నెలల దాకా ఈ సినిమా అప్డేట్ ఏమి ఉండదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

నిన్న సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజయ్యాక నాగవంశీ తన ట్విట్టర్లో.. సూపర్ ఫ్యాన్స్.. థియేటర్స్ లో టైటిల్, గ్లింప్స్ కు మీరిచ్చిన రెస్పాన్స్ పండగలా ఉంది. థియేటర్స్ కి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఆగస్టు 9వ తేదీన ఇస్తాము. అప్పటిదాకా ఇదే అంచనాలతో వెయిట్ చేయండి అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9. అప్పటిదాకా అంటే ఇంకో రెండు నెలల దాకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Siddharth : భారతీయుడు 2 సినిమాపై సిద్దార్థ్ కామెంట్స్.. ఆ పాత్రలో నటిస్తున్నాడట..

ఇటీవల అభిమానులు తమ హీరోల సినిమాల అప్డేట్స్ ఇవ్వండి అంటూ నిర్మాతలని, నిర్మాణ సంస్థల్ని ట్విట్టర్ లో ఆడేసుకుంటున్నారు. ఇలాంటివి ఏం ఉండకూడదని ముందే నిర్మాత ఇలా ట్వీట్ చేశాడేమో అని అనుకుంటున్నారు. అయితే రెండు నెలల వరకు సినిమా నుంచి అప్డేట్ లేదు అని చెప్పడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక గుంటూరు కారం సినిమా వచ్చే సంక్రాంతి 2024 జనవరి 13న రిలీజ్ కానుంది.