Guntur Kaaram Song : గుంటూరు కారం ‘కుర్చీ మడతపెట్టి..’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్పులు మాములుగా లేవుగా..
గుంటూరు కారం నుంచి నిన్న ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ట్రెండింగ్ డైలాగ్ తో పాట ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
- Saketh U
- Published On : December 30, 2023 / 04:08 PM IST
Guntur Kaaram Song : త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మహేష్ బాబుని పక్కా మాస్ రోల్‌లో చూపిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన రెండు పాటలు, గ్లింప్స్, మహేష్ బాబు మాస్ పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది.
Also Read : Guntur Kaaram : గుంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మహేష్.. కుర్చీ మడతపెట్టి..
ఇక నిన్న ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ట్రెండింగ్ డైలాగ్ తో పాట ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా ఇక ఈ పాటని సాహితి చాగంటి, శ్రీకృష్ణ కలిసి పాడారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాటని రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన చిన్న ప్రోమోలోనే మహేష్, శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది. థియేటర్ లో ఈ సాంగ్ కి నిజంగా కుర్చీలు ఇరిగిపోవాల్సిందే. ఫుల్ సాంగ్ మీరు కూడా చూసేయండి..
