Guntur Kaaram : గుంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మహేష్.. కుర్చీ మడతపెట్టి..

గుంటూరు కారం నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది. కుర్చీ మడతపెట్టి..

Guntur Kaaram : గుంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మహేష్.. కుర్చీ మడతపెట్టి..

Mahesh Babu released Guntur Kaaram Kurchi Madathapetti Song Promo

Updated On : December 29, 2023 / 11:34 AM IST

Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ గురువారం కొన్ని ప్యాచ్ వర్క్స్ తో షూటింగ్ పూర్తి అయ్యినట్లు సమాచారం. మహేష్ బాబుని పక్కా మాస్ రోల్‌లో చూపిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న మూవీ టీం.. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. మొదటి సాంగ్‌ని మాస్ బీట్ తో రెడీ చేసిన మూవీ టీం.. సెకండ్ సాంగ్ లవ్ బీట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు మూడో సాంగ్ ని మరో మాస్ బీట్ తో సిద్ధం చేశారు. తాజాగా ఈ మూడో సాంగ్ ని మహేష్ రిలీజ్ చేశారు. ‘కుర్చీ మడతపెట్టి’ అనే ట్రేండింగ్ డైలాగ్ ని తీసుకోని పాటని రాసారు.

రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఇక ఫుల్ సాంగ్ ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రిలీజ్ చేసిన చిన్న ప్రోమోలోనే మహేష్, శ్రీలీల మాస్ డాన్స్ అదిరిపోయింది. థియేటర్ లో ఈ సాంగ్ కి నిజంగా కుర్చీలు ఇరిగిపోవాల్సిందే. మరి ఆ మాస్ ప్రోమోని మీరు కూడా చూసేయండి.

Also read : Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్..

కాగా మహేష్ బాబు నేడు దుబాయ్ వెకేషన్ కి బయలుదేరారు. గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు.. దుబాయ్ లో ఓ యాడ్ షూటింగ్ కోసం బయలుదేరారు. ఈరోజు ఉదయం అలాగే నమ్రత, గౌతమ్, సితారతో ఒక షార్ట్ ఫ్యామిలీ వెకేషన్ ని కూడా ప్లాన్ చేశారు. యాడ్ షూటింగ్ పూర్తి చేసిన తరువాత అక్కడే ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తిరిగి రానున్నారట.