×
Ad

Naga Vamsi : మహేష్ గుంటూరు కారం.. రాజమౌళి సినిమాల కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది.. బాబు తగ్గేదేలే..

గుంటూరు కారం నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా భారీ విజయం సాధిస్తుంది. రాజమౌళి సినిమాలకు సమానంగా కలెక్షన్స్ వస్తాయి అని అన్నారు.

  • Published On : September 27, 2023 / 08:45 AM IST

Mahesh Babu Guntur Kaaram Movie will Collects equal to Rajamouli Movies Collections Producer Naga Vamsi increase Hype on Movie

Producer Naga Vamsi :  మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. మహేష్ అభిమానులు ఈ సినిమా వాయిదా పడుతున్నందుకు, ఎలాంటి అప్డేట్స్ లేనందుకు నిరాశలో ఉన్నారు. కానీ గుంటూరు కారం సినిమా సంక్రాతికి రిలీజ్ పక్కా అని ఇటీవల మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే.

గుంటూరు కారం నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా భారీ విజయం సాధిస్తుంది. రాజమౌళి సినిమాలకు సమానంగా కలెక్షన్స్ వస్తాయి అని అన్నారు.

Also Read : Salaar Vs Dunki : ప్రభాస్ ‘సలార్’ వర్సెస్ షారుఖ్ ‘డుంకి’.. మీమ్స్‌తో ఆడేసుకుంటున్న అభిమానులు, నెటిజన్లు.. మీరు చూశారా?

తాజాగా మ్యాడ్ సినిమా ఈవెంట్ లో కూడా నాగవంశీని ఓ విలేఖరి దీనిపై ప్రశ్నించగా.. నాగవంశీ సమాధానమిస్తూ.. ఇప్పటికి అదే మాట మీద ఉన్నాను. డౌట్ లేదు. కచ్చితంగా గుంటూరు కారం సినిమా రాజమౌళి సినిమాల రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని అన్నారు. దీంతో మరోసారి నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ తో మహేష్ అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు.