Mahresh Babu : చావుబతుకుల్లో వీరాభిమాని.. పిల్లలకు మహేష్ సినిమా పేర్లు.. పిల్లల్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు..

మహేష్ వీరాభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు.

Mahesh Babu Helped to his Fan and Adopted his Fan children's

Mahresh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే 1000కి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు మహేష్. తన అభిమానులు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మహేష్ అండగా నిలుస్తాడు.

తాజగా మహేష్ బాబు తన వీరాభిమానికి పెద్ద సహాయం చేసాడు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి కృష్ణకు, మహేష్ బాబుకి వీరాభిమాని. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేష్ కి మహేష్ బాబు అంటే ఎంత పిచ్చి అంటే తన ముగ్గురు కొడుకులకు కూడా మహేష్ బాబు సినిమాల పేర్లు పెట్టాడు. తన కొడుకులు పుట్టినప్పుడు మహేష్ బాబు రిలీజయిన సినిమాలు ఏవి ఉంటే వాటి పేర్లు పెట్టాడు. రాజేష్ మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కొడుకు పేరు అతిధి, మూడో కొడుకు పేరు ఆగడు అని పెట్టడం గమనార్హం.

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్.. మొదటి సారి పేరెంట్స్‌ని..

అయితే మహేష్ వీరాభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. పేద కుటుంబం కావడంతో పిల్లలు చదువు మానేసి పనులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. పెద్ద కొడుకు చెప్పుల షాప్ లో పని చేస్తున్నాడు. అయితే ఈ విషయం ఆ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలియడంతో మహేష్ అభిమానులకు ఈ విషయాన్ని తెలియచేసారు. ఈ విషయం మహేష్ బాబు వద్దకు చేరడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీమ్ పెదప్రోలుకు వచ్చి రాజేష్ పిల్లలు అతిధి, ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్ లో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. ప్రతి సంవత్సరం మహేష్ నుంచే డబ్బులు వస్తాయని, వాళ్ళని చదివిస్తామని చెప్పినట్టు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.

దీంతో మహేష్ చేసిన ఈ మంచి పని బయటకు రావడంతో మరోసారి అభిమానులతో పాటు నెటిజన్లు మహేష్ మంచితనాన్ని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు