Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్.. మొదటి సారి పేరెంట్స్‌ని..
ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళాడు.

Vijay Deverakonda Shares his Family Photos from US Vacation
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలవగా ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్ళాడు. విజయ్, ఆనంద్, తమ పేరెంట్స్.. నలుగురు కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు.
అమెరికాలో విజయ్ దేవరకొండ కోసం అక్కడి తెలుగు వాళ్ళు చేసిన హంగామా వీడియోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యామిలీ అమెరికా వెకేషన్ పూర్తి చేసుకొని తిరిగొచ్చారు. తాజాగా విజయ్ దేవరకొండ అమెరికాలో తన పేరెంట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా అమ్మానాన్నలను మొదటిసారి అమెరికాకు తీసుకెళ్ళాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
దీంతో విజయ్ పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. విజయ్ అమ్మానాన్నలను మొదటిసారి అమెరికా తీసుకెళ్లడంపై తన పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.