Lucky Baskhar Song : మీనాక్షిని ‘శ్రీమతి గారు..’ అంటున్న దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

తాజాగా లక్కీ భాస్కర్ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసారు.

Lucky Baskhar Song : మీనాక్షిని ‘శ్రీమతి గారు..’ అంటున్న దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

Dulquer Salmaan Meenakshi Chaudhary Lucky Baskhar Movie First Song Released

Updated On : June 19, 2024 / 11:28 AM IST

Lucky Baskhar Song : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం.. లాంటి సినిమాలతో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మరో డైరెక్ట్ తెలుగు సినిమా ‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ చూశారా? ‘శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్’ అంటూ..

ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా వైడ్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసారు. మెలోడీగా సాగిన ఈ పాట వినడానికి బాగుంది. మీరు కూడా శ్రీమతి గారు.. అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ ని వినేయండి.

‘కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు.. అంటూ సాగిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ రాయగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ పాడారు. ప్రస్తుతం ఈ మెలోడీ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ పాట చూస్తుంటే ఈ సినిమాలో దుల్కర్, మీనాక్షి భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడు.