Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ చూశారా? ‘శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్’ అంటూ..
పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది.

AP Deputy CM Pawan Kalyan Name Board goes Viral
Pawan Kalyan Name Board : ఏపీ ఎన్నికల్లో జనసేన, పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇక పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రితో మంత్రిగా కూడా పలు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖలు కేటాయించారు.
నేడు పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పవన్ బాధ్యతలు తీసుకున్న వీడియోలు వైరల్ గా మారగా మరోపక్క పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది.
Also Read : డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్.. పవన్ వెంట ఎవరెవరు ఉన్నారంటే..
పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ బోర్డులో.. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, గౌ||ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది & గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు అని రాసి పెట్టారు. అలాగే ఇదే మ్యాటర్ ను నేమ్ బోర్డు పై ఇంగ్లీష్ లో కూడా రాశారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేమ్ బోర్డుని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఇది కదా కొన్నేళ్లుగా కోరుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.