Mahesh Babu latest looks from Varanasi movie
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి(Varanasi)’. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
Karuppu: ‘కరుప్పు’ మూవీ వివాదం.. హీరోపై డైరెక్టర్ కేసు.. ఆందోళనలో అభిమానులు
తాజాగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు లుక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా వారణాసి సినిమా కోసం అంటార్కిటికాకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో ట్రెండీ లుక్ లో కనిపించాడు. క్యాప్ ధరించి, గాగుల్స్ ధరించి క్రేజీ లుక్ లో కనిపించాడు. దీంతో, ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అంటార్కిటికాలో మొదలుకానుంది. అందుకోసం మేకర్స్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకుంటున్న రెండవ సినిమాగా వారణాసి సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా, చాలా ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.