Mahesh Babu : ‘పుష్ప’ సినిమాపై మహేష్‌బాబు రివ్యూ
తాజాగా మహేష్ బాబు 'పుష్ప' సినిమా చూసి ట్విటర్ వేదికగా రివ్యూ ఇచ్చాడు. ''పుష్పగా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు..
- Saketh U
- Updated on- January 5, 2022 / 10:23 AM IST
Pushpa
Mahesh Babu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా సాధిస్తుంది. ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులంతా అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
తాజాగా మహేష్ బాబు ‘పుష్ప’ సినిమా చూసి ట్విటర్ వేదికగా రివ్యూ ఇచ్చాడు. ”పుష్పగా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా, రియాలిటీకి దగ్గరిగా ఉంటాయో సుకుమార్ మరోసారి నిరూపించాడు” అని ట్వీట్ చేశాడు.
Anupama Parameswaran : నేను కూడా ప్రేమలో పడ్డాను.. విడిపోయాను.. కాని : అనుపమ పరమేశ్వరన్
ఇక మరో ట్వీట్ లో… ”దేవి శ్రీ ప్రసాద్.. నీ గురించి ఏం చెప్పను?. నువ్వో రాక్‌స్టార్‌వి. మైత్రీ మూవీ మేకర్స్ టీమ్‌కు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది” అని పోస్ట్ చేశాడు. మహేష్ చేసిన ఈ ట్వీట్స్ కి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. అల్లు అర్జున్.. ”థ్యాంక్యూ మహేష్ గారు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. మా టీం వర్క్ మీకు నచ్చడం గౌరవంగా భావిస్తున్నాము” అని రిప్లై ఇచ్చారు.
