Mahesh Babu – Murari : జ్వరంతోనే ఆ సాంగ్, ఫైట్ షూటింగ్ చేసిన మహేష్ బాబు..

ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు చాలా కష్టపడ్డాడట.

  • Updated on- August 8, 2024 / 11:35 AM IST

Mahesh Babu shot a song and fight with fever for Murari Movie

Mahesh Babu – Murari : మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మురారి సినిమా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజున రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమాని, సాంగ్స్ ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్లో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

మురారి రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటుల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయడంతో మురారి షూటింగ్ సమయంలో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే మురారి సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

Also Read : Ravibabu – Murari : పదేళ్ల తర్వాత ‘మురారి’ సినిమా ఏనుగు నన్ను గుర్తుపట్టింది.. రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు చాలా కష్టపడ్డాడట. జ్వరం వచ్చినా కూడా షూటింగ్ చేసాడు. మురారి సినిమాలో ‘డుమ్ డుమ్ నటరాజు ఆడాలి..’ సాంగ్ తో పాటు ఒక ఫైట్ సీక్వెన్స్ ని మహేష్ బాబు జ్వరంతో ఉన్నా చేసాడట. అది కూడా ఆ సాంగ్, ఫైట్ రెండూ నీళ్ళల్లోనే ఉండటం గమనార్హం. జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా, తన కోసం షూటింగ్ ఆపితే నిర్మాతకు నష్టం కలుగుతుందని అలాగే షూటింగ్ చేసాడు మహేష్ బాబు. ఈవిషయాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.