Srinivasa Mangapuram: మా కుర్రోళ్లను బ్రతకనివ్వరా.. మహేష్ బాబు ‘కొడుకు’ జయకృష్ణ కుమ్మేశాడుగా.. రెండో సాంగ్ ప్రోమో వచ్చేసింది
శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Updated on- May 12, 2026 / 06:01 PM IST
mahesh babu song jayakrishna srinivasa mangapuram second song promo released
-
జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ గ్రాండ్ ఎంట్రీ.
-
సూపర్ స్టార్ వారసుడి మాస్ లుక్.
-
వైరల్ అవుతున్న సెకండ్ సింగిల్ ప్రోమో.
Srinivasa Mangapuram: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచగా, తాజాగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటలో జయకృష్ణ చూపించిన ఎనర్జీ, మాస్ లుక్ చూస్తుంటే ఘట్టమనేని మూడో తరం వారసుడు బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
NtrNeel: ‘ఎన్టీఆర్ డ్రాగన్’ గ్లింప్స్ కోసం నంబర్ గేమ్.. పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేస్తున్నారుగా
జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీలో బాబాయ్ మహేష్ బాబు గ్లామర్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా సాంగ్‌లో ఆయన వేసిన స్టెప్పులు, ‘కుర్రోళ్లను బ్రతనివ్వరా’ అంటూ చెప్పిన డైలాగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి సినిమాతోనే నటుడిగా, డాన్సర్‌గా మంచి ఈజ్ చూపిస్తున్న జయకృష్ణ, టాలీవుడ్‌లో ఫ్యూచర్ స్టార్‌గా నిలుస్తారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాతో ఘట్టమనేని ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహం రావడం ఖాయం.
