Mahesh Babu : అభిమానులకి మహేష్ స్పెషల్ లేఖ..
మహేష్ ఈ లేఖలో సర్కారు వారి పాట సినిమాతో పాటు, తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. మహేష్.. ''ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - జి.యమ్.బి. ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై.........
- Saketh U
- Published On : May 7, 2022 / 06:28 PM IST
Mahesh
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పరుశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ లకి భారీ స్పందన లభించింది. నేడు (మే 7న) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. తాజాగా మహేష్ తన అభిమానులకి స్పెషల్ లేఖ రాయడంతో ఈ లేఖ వైరల్ అవుతుంది.
మహేష్ ఈ లేఖలో సర్కారు వారి పాట సినిమాతో పాటు, తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. మహేష్.. ”ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ – జి.యమ్.బి. ఎంటర్ టైన్ మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ – యలమంచిలి రవి శంకర్ – ఆచంట రామ్ – ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు.”
Kiara Advani : ఎక్కువమంది హిందీ మాట్లాడతారు.. సినిమాలని రీమేక్ చేయడం తప్పేం కాదు..
”మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలుకానుంది. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి- మహేష్ బాబు” ఈ లేఖలో పేర్కొన్నారు. మహేష్ ఇలా అభిమానులని ఉద్దేశించి లేఖ రాయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మహేష్ బాబు ఎక్కడా అధికారికంగా పోస్ట్ చేయకపోవడం, వేరే వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయడం, ఈ మ్యాటర్ మహేష్ చెప్పినట్టు లేదని, ఇది ఫ్యాన్ మేడ్ లెటర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Superstar #MaheshBabu's letter to fans.
Requests fans to watch #SarkaruVaariPaata only in theaters.#SSMB28 begins from June. pic.twitter.com/GHApyH47df
— Manobala Vijayabalan (@ManobalaV) May 7, 2022
