Kiara Advani : ఎక్కువమంది హిందీ మాట్లాడతారు.. సినిమాలని రీమేక్ చేయడం తప్పేం కాదు..

ఓ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ''ఓటీటీలు బాగా వాడుకలోకి రాకముందు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్‌ సింగ్‌ చేశాను. దాన్ని ఇప్పుడు చేయమన్నా మళ్ళీ చేస్తాను. కానీ..............

Kiara Advani : ఎక్కువమంది హిందీ మాట్లాడతారు.. సినిమాలని రీమేక్ చేయడం తప్పేం కాదు..

Kiara

Kiara Advani :  గత కొన్ని రోజులుగా మన సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధిస్తుండటంతో సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ సోషల్ మీడియాలో, వార్తల్లో అందరూ చర్చించుకుంటున్నారు. ఈ చర్చ హిందీ, లోకల్ లాంగ్వేజ్ అంటూ భాషా వివాదంగా కూడా మారింది. కన్నడ స్టార్ హీరో సుదీప్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మొదలు పెట్టిన ఈ భాషా వివాదంపై ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు.

తాజాగా సౌత్ సినిమాలు, బాలీవుడ్ లో వరుస రీమేక్ లు, హిందీ భాషపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కియారా హీరోయిన్‌గా నటించిన భూల్‌ భులాయా 2 త్వరలో రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది.

Parashuram : నేను ఆయన ఫ్యాన్.. అందుకే సర్కారు వారి పాటలో ఆ డైలాగ్ వాడాను..

ఓ ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ”ఓటీటీలు బాగా వాడుకలోకి రాకముందు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్‌ సింగ్‌ చేశాను. దాన్ని ఇప్పుడు చేయమన్నా మళ్ళీ చేస్తాను. కానీ ఏదైనా రీమేక్‌ చేయాలని వచ్చిన సినిమా ఓటీటీలో అప్పటికే అందుబాటులో ఉంటే ఆ సినిమా చేయడానికి కచ్చితంగా ఆలోచిస్తాను. కొన్ని చిన్న సినిమాలు చాలా బాగుంటాయి. కానీ వాటిని ఒక్క భాషలోనే తీస్తారు కనుక ఎక్కువమంది జనాలకు రీచ్ అవ్వదు. దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి ఆ సినిమాల్లోని కథను తీసుకుని దానికి కొన్ని మార్పుచేర్పులు చేసి ఎక్కువమంది జనాలు మాట్లాడే హిందీలో చూసేలా రీమేక్ చేయడం తప్పు లేదు” అని తెలిపింది.