Mahesh Babu : తల్లికి స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపిన సూపర్ స్టార్
ఇవాళ మహేష్ బాబుకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫోటోని షేర్ చేసి పుట్టిన రోజు...............
- Saketh U
- Published On : April 20, 2022 / 02:45 PM IST
Mahesh
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు షూట్స్ లేకపోతే కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికి తెలిసిందే. తన తల్లిపై మహేష్ అమితమైన ప్రేమని చూపిస్తారు. ఆవిడ ఎక్కువగా బయటకి రాకపోయినా మహేష్ అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కి బయటకి తీసుకువచ్చేవారు. ఇటీవలి కాలంలో మహేష్ తల్లి ఇందిరమ్మ అసలు బయటకి రాలేదు. మహేష్ అప్పుడప్పుడు ఆవిడ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ప్రేమని తెలియచేస్తూ ఉంటాడు.
ఇక ఇవాళ మహేష్ బాబుకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిరా దేవీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫోటోని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ఇందిరా దేవి ఫోటోని షేర్ చేసి.. ”హ్యాపీ బర్త్ డే అమ్మా. మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. నీ మీద ప్రేమని ఒక్క రోజులో చూపించడానికి సరిపోదు. ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాను” అంటూ పోస్ట్ చేశారు.
Tatineni Ramarao : తాతినేని రామారావు మృతి పట్ల సంతాపం తెలిపిన బాలకృష్ణ
ఇక మహేష్ సోదరి మంజుల కూడా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నమ్రతా శిరోద్కర్ కూడా ఆమెకు విషెష్ తెలుపుతూ గౌతమ్, సితార ఇందిరమ్మతో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇక మహేష్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా మహేష్ తల్లి ఇందిరా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always ??? pic.twitter.com/92aqNPmUQR
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022
