SSMB28 : మహేష్ బాబు సినిమా షెడ్యూల్, టీజర్, టైటిల్ పై ఆసక్తికర న్యూస్.. ట్విట్టర్‌లో వైరల్!

మహేష్ బాబు SSMB28 సినిమా కొత్త షెడ్యూల్, టీజర్, టైటిల్ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. మోసగాళ్లకు మోసగాడు..

Mahesh Babu SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ మొదలు పెట్టుకోవడం చాలా లేట్ చేసిన చిత్ర యూనిట్.. చిత్రీకరణ విషయంలో కూడా అదే లేటుని కంటిన్యూ చేస్తుంది. ఆగష్టుకి రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వెళ్లారు.

Sitara Ghattamaneni : దీపికా పాటకు మహేష్ కూతురు సితార అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్!

కాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలు అవుతుంది అన్న అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ విషయం పై ఒక వార్త బయటకి వచ్చింది. జూన్ 5 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుందట. అలాగే ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ గురించి కూడా ఆసక్తికర న్యూస్ వినిపిస్తుంది. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31) సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రదర్శన సమయంలోనే SMMB28 టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. ఈ సినిమా మహేష్ బాబుకి జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు