Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!
రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమాలో మహేష్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందట.

Mahesh Babu role in Rajamouli movie has inspired from lord hanuman
Rajamouli – Mahesh Babu : RRR సినిమాతో గ్లోబల్ మార్కెట్ కి దారి వేశాడు దర్శకధీరుడు రాజమౌళి. హాలీవుడ్ ఆడియన్స్ నుంచే కాదు స్టార్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ నుంచి కూడా ప్రశంసలు అందుకొని హాలీవుడ్ లో ఇండియన్ సినిమాలకు ఆదరణ పెరిగేలా చేసింది. ఇక ఈ సినిమాతో రాజమౌళి తదుపరి చిత్రాలు పై హాలీవుడ్ లో కూడా ఆసక్తి నెలకుంది. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ కథతో ఉండబోతుందని రాజమౌళి వెల్లడించాడు.
కాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ రామాయణంలోని హనుమంతుడి పాత్రను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాల పై మహేష్ బాబు పోరాడనున్నాడట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో ఈ సినిమా సాగబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం రాజమౌళి అండ్ టీం భారీ కసరత్తు చేస్తున్నారట.
ఇక ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ VFX టెక్నీషియన్స్ తో అగ్రిమెంట్ ని కూడా చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యేందుకు బడా సంస్థలు సోనీ పిక్చర్స్ (Sony Pictures), డిస్నీ (Disney) పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ సోనీ పిక్చర్స్ రాజమౌళితో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుంది అంటూ ఒక వార్త హల్ చల్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తెలియనున్నాయి.