×
Ad

Prithviraj Sukumaran : పృథ్వీ ఈగలకు దండం పెట్టుకున్నాడు.. వారణాసి షూటింగ్‌లో ఫన్నీ సంగతులు చెప్పిన మహేష్..

షూటింగ్ సమయంలో పృథ్వీరాజ్ కి సంబంధించిన ఓ ఫన్నీ సంఘటనను మహేష్ తెలిపాడు. (Prithviraj Sukumaran)

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran : రాజమౌళి వారణాసి సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి సినిమాలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ కుంభ అనే పాత్రలో నెగిటివ్ రోల్ చేషున్నారు. వీల్ చైర్ లోనే కూర్చొని నడిపించే పాత్ర అది. ఇప్పటికే పృథ్వీరాజ్ వీల్ చైర్ లో కూర్చొని ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు.(Prithviraj Sukumaran)

మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంక హాలీవుడ్ లో వారణాసి ప్రమోషన్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా షూటింగ్ సమయంలో పృథ్వీరాజ్ కి సంబంధించిన ఓ ఫన్నీ సంఘటనను మహేష్ తెలిపాడు.

Also Read : Varanasi : వారణాసి రెండు పార్టులు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఊపిరి పీల్చుకున్న మహేష్ ఫ్యాన్స్..

మహేష్ మాట్లాడుతూ.. పృథ్వీ వీల్ చైర్ లో నుంచి కదల్లేడు. ఓ రోజు షూట్ జరుగుతుంది. ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంది. అది చెప్పేటప్పుడు అతని ఫేస్ మీదకు ఈగలు వచ్చాయి. అప్పుడు చాలా కష్టపడ్డాడు. ఆ వీల్ చైర్ లో అతన్ని ఫిక్స్ చేసేసారు చేతులు కూడా కదలవు. దాంతో ఈగలకు దండం పెట్టుకుంటున్నాడు. ఈ ఒక్క షాట్ అవ్వనివ్వు నా దగ్గరికి రాకు అని ఈగలకు దండం పెట్టుకున్నాడు. అవి విన్నాయేమో ఆ తర్వాత ఈగలు రాలేదు అని నవ్వుతూ సరదాగా చెప్పాడు.

ఇక కుంభ క్యారెక్టర్ గురించి, వీల్ చైర్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. సినిమాలో వీల్ చైర్ చాలా ఇంపార్టెంట్. వీల్ చైర్ కుంభ పాత్ర పర్సనాలిటికి తగినట్టు ఉంటుంది. అతను చాలా డేంజరస్ పర్సన్. అతని శరీరం పనిచేయకపోయినా అతని మైండ్ డేంజర్ గా వర్క్ అవుతుంది. వీల్ చైర్ కుంభకు సపోర్ట్ గా ఉంటుంది. కుంభ పాత్రకు వీల్ చైర్ ఇంకో శరీరం లాంటిది అని తెలిపాడు. దీంతో వీల్ చైర్ లో కూర్చొనే సినిమాలో పవర్ ఫుల్ విలనిజం పృథ్వీరాజ్ పండించబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Mahesh Babu : రాజమౌళికి మెసేజ్ చేసిన మహేష్.. ఆయన ఇచ్చిన రిప్లై చూసి షాక్.. ఇద్దరిమధ్య ఏం జరిగిందో తెలుసా?