Mahesh Babu : రాజమౌళికి మెసేజ్ చేసిన మహేష్.. ఆయన ఇచ్చిన రిప్లై చూసి షాక్.. ఇద్దరిమధ్య ఏం జరిగిందో తెలుసా?
మహేష్ బాబు సినిమా ఓకే అయ్యాక రాజమౌళితో జరిగిన చాటింగ్ గురించి తెలిపాడు. (Mahesh Babu)
Mahesh Babu
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూలు విడుదల చేయగా అందులో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Mahesh Babu)
ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా ఓకే అయ్యాక రాజమౌళితో జరిగిన చాటింగ్ గురించి తెలిపాడు.
Also Read : Mahesh Babu : హాలీవుడ్ ఇంటర్వ్యూలో ‘పోకిరి’ గురించి మాట్లాడిన మహేష్.. ఏం చెప్పాడో తెలుసా?
మహేష్ బాబు మాట్లాడుతూ.. మా ఇంటికి వచ్చి రాజమౌళి లంచ్ లో కూర్చొని సినిమా చేద్దాం అని డిస్కస్ చేసాము. ఎలాంటి సినిమా చేయాలి అని రాజమౌళి అడిగాడు. నేనేం చెప్తాను రాజమౌళి లాంటి డైరెక్టర్ కి మీ ఇష్టం అన్నాను. డిస్కషన్ అంతా అయ్యాక సినిమా చేద్దాం అని ఫిక్స్ అయ్యాము. అతను ఇంటికి వెళ్ళాక మీ సినిమాలో చేయడం హ్యాపీగా ఉంది. మీ సినిమాలో హీరోలను బాగా చూపిస్తారు అది నాకు ఇష్టం. మీరు హీరోలను బాగా ఇష్టపడతారు అని మెసేజ్ పెట్టాను. దానికి రాజమౌళి.. కానీ నాకు విలన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు. దానికి నాకు ఏం చెప్పాలో తెలియక స్మైల్ సింబల్ ఇచ్చాను అని తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో ఉన్న పృథ్వీరాజ్.. విలన్ ఎంత భయపెడితే హీరో అంత గ్రేట్ అవుతాడు అని చెప్పుకొచ్చాడు.
