Guntur Kaaram : మహేష్ అభిమానులకు పండగే.. గుంటూరు కారం సినిమాలో లేని సాంగ్ త్వరలో రిలీజ్..
గుంటూరు కారం సినిమాలో ఆరు పాటలు మాత్రమే ఉండగా సినిమాలో లేని ఇంకో పాటని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.
- Saketh U
- Published on- March 12, 2024 / 09:59 AM IST
Mahesh Babu Trivikram Guntur Kaaram Movie 7th Song Releasing Soon Thaman Tweet goes Viral
Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా చేసిన గుంటూరు కారం సినిమా ఇటీవల సంక్రాంతికి రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఈ సినిమా విజయంపై మహేష్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.
గుంటూరు కారం సినిమాలో సాంగ్స్ కూడా బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కుర్చీ మడతబెట్టి.. సాంగ్ అయితే బాగా పాపులర్ అయింది. మిగిలిన అయిదు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో ఆరు పాటలు మాత్రమే ఉండగా సినిమాలో లేని ఇంకో పాటని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. గుంటూరు కారం సినిమా కోసం మరో పాట కూడా రాసి షూట్ చేసినట్టు సమాచారం. కాకపోతే ఫైనల్ ఎడిటింగ్ లో ఆ సాంగ్ తీసి పక్కన పెట్టేశారంట.
Also Read : Anchor Pradeep : వామ్మో ప్రదీప్ ఇలా అయిపోయాడేంటి.. కండలు పెంచేసి.. చాన్నాళ్ళకి కనపడిన యాంకర్ ప్రదీప్..
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియాలో.. గుంటూరు కారం సినిమా నుంచి 7వ సాంగ్ శుక్రవారం రిలీజ్ అవ్వనుంది. మహేష్ బాబు బెస్ట్ సాంగ్ ఇది. లిరికల్ వీడియో రెడీ అవుతుంది. చాలా హాట్ గా ఉంటుంది అని పోస్ట్ చేసాడు. దీంతో తమన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సినిమాలో ఎందుకు ఈ సాంగ్ పెట్టలేదు, త్వరగా రిలీజ్ చేయండి అంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
