SSMB28 Title Glimpse : బీడీ 3d లో కనబడుతోందా.. మహేష్ మాస్ స్ట్రైక్ అదిరిపోయింది!
మహేష్ బాబు SSMB28 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి టైటిల్ ని ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ లో మహేష్ ఆక్షన్ అయితే..
- gum 95921
- Published On : May 31, 2023 / 06:23 PM IST
Mahesh Babu Trivikram SSMB28 title glimpse released
SSMB28 Gunturu Kaaram : మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మహేష్ మాస్ లుక్స్ ఆడియన్స్ లో భారీ క్యూరియాసిటీని కలగజేశాయి. కాగా ఈ మూవీ టైటిల్ ని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా నేడు (మే 31) అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కృష్ణ పుట్టిరోజు సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని రీ రిలీజ్ చేయగా.. ఆ మూవీతో పాటు థియేటర్ SSMB28 టైటిల్ గ్లింప్స్ ని ప్రదర్శించారు.
తాజాగా యూట్యూబ్ లో కూడా ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ముందు నుంచి ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరుకి మొనగాడు’ టైటిల్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో ‘గుంటూరు కారం’ టైటిల్ నే ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ లో మహేష్ బాబు మాస్ చూసిన ఆడియన్స్.. మహేష్ మాస్ స్ట్రైక్ అదిరిపోయింది అంటున్నారు. మహేష్ నోటిలో నుంచి బీడీ తీసి కలుస్తుంటే ఊరమాస్ లా ఉంది. ఇక ఈ గ్లింప్స్ లో మహేష్.. “ఏంది అట్ట చూస్తున్నావ్. బీడీ 3d లో కనబడుతోందా” అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Ugram : అల్లరి నరేష్ ఉగ్రం.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..
ఈ గ్లింప్స్ కి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంది. కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్లు, దాదాపు మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది.
