Varanasi: లీకైన ‘వారణాసి’ సినిమా కథ.. కాశీ నుంచి గ్లోబల్ మిషన్ వరకు.. రాజమౌళి మైండ్ బ్లోయింగ్ విజన్

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న మహేష్ బాబు 'వారణాసి(Varanasi)' సినిమా కథ.

Mahesh Babu Varanasi Movie Story Leaked on Social Media

  • మహేష్ బాబు వారణాసి కథ లీక్
  • శివ భక్తుడిగా మహేష్ బాబు.. గ్లోబల్ డామినేషన్ ప్లాన్
  • డివోషనల్ ట్విస్ట్ తో రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం వారణాసి(Varanasi). చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో వారణాసిపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీనికి సంబందించిన అనౌన్సమెంట్ వీడియో విడుదలైనప్పటి నుంచి వారణాసి సినిమా ఎలా ఉండబోతుంది, అసలు కథ ఏమై ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేపథ్యంలో, తాజాగా బయటకు వచ్చిన ఈ సినిమా కథాంశం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Nabha Natesh: శృంగేరి విద్యాశంకర ఆలయంలో నాభా నటేష్.. కుటుంబంతో స్పెషల్ ఫోటోలు వైరల్

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, వారణాసి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక శివ భక్తుడు, కాలగర్భంలో కలిసిపోయిన అపార శక్తి కలిగిన విశ్వ కళాఖండం కోసం సాహసోపేతమైన అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదిస్తూ సాగే ఈ ప్రయాణంలో, తనను నడిపిస్తున్న శక్తుల వెనుక ప్రపంచాధిపత్యం ఆశించే ఒక క్రూరమైన మాస్టర్‌మైండ్ ఉన్నాడనే భయంకర నిజం అతనికి తెలుస్తుంది.

ఆధ్యాత్మికత ముసుగులో జరుగుతున్న ఈ గ్లోబల్ కుట్రను అడ్డుకోవడమే తన అసలు లక్ష్యమని ఆ భక్తుడు గ్రహిస్తాడు. పవిత్ర కాశీ సాక్షిగా, అధికారం కోసం పాకులాడే దుష్ట శక్తికి, అచంచలమైన భక్తికి మధ్య జరిగే మహా పోరాటమే ఈ చిత్రం. తనను పావుగా వాడుకోవాలని చూసిన వారిని ఎదురించి, ఆ దివ్య శక్తి లోకకల్యాణానికి ఎలా ఉపయోగపడిందనేదే ఈ ఉత్కంఠభరిత కథాంశమే వారణాసి కథ. ప్రస్తుతం ఈ కథ నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఇదే గనక నిజమైన కథ అయితే మాత్రం ఇండియా లెవల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవడం ఖాయం. అలాగే, ఇండియా నుంచి అఫీషియల్ గా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే సినిమాగా కూడా వారణాసి నిలవడం ఖాయం. మరి చూడాలి ఏప్రిల్ 7, 2027 న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అని.