Venky-Anil- Kalyan Ram: వెంకటేష్- కళ్యాణ్ రామ్ తో అనిల్ కొత్త మూవీ.. టైటిల్ తోనే హిట్ కొట్టేశారుగా!
వెంకటేష్- కళ్యాణ్ రామ్- అనిల్ రావిపూడి(Venky-Anil- Kalyan Ram) కాంబోలో వస్తున్న సినిమాకు క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 06:58 PM IST
Makers planning Bava Bavamaridi title for Venkatesh-Kalyan Ram-Anil Ravipudi movie
Venky-Anil- Kalyan Ram: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మాంచి జోష్‌లో ఉన్నారు. రీసెంట్ గా ఆయన మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్టును మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ -నందమూరి కళ్యాణ్ రామ్(Venky-Anil- Kalyan Ram) కాంబోలో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే, ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Anchor Manjusha: యాంకర్ మంజూష.. ఓర చూపులతో ఎక్కిస్తోంది నిషా.. ఫొటోలు
ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘బావ బావమరిది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, అనిల్ రావిపూడి తన మార్క్ వినోదంతో ఈ టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీ తోడైతే ఈ ‘బావ బావమరిది’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలంటేనే మినిమం గ్యారెంటీ వినోదం ఉంటుంది. అందులోనూ వెంకటేష్‌తో ఆయనకు ఉన్న బాండింగ్ ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో ఇప్పటికే ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కు కళ్యాణ్ రామ్ తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. మేకర్స్ త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
