×
Ad

Malavika Mohanan: నిజం ఒప్పుకున్న మాళవిక.. రాజాసాబ్ డూప్ ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్

రాజసామ్ సినిమాలో తన డూప్ ని వాడటంపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన మాళవిక మోహనన్ (Malavika Mohanan).

Malavika Mohanan responds to trolling over her dupe

Malavika Mohanan: ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజసాబ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటినుంచి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి, ఇటు నెటిజన్స్ నుంచి ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఇక ఓటీటీ విడుదల తరువాత ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయ్యింది. అసలు సినిమాలో నటించింది ప్రభాస్ కాదని, చాలా చోట్ల డూప్ ను వాడారని స్క్రీన్ షాట్స్ తీసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక వీఎఫెక్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయంటూ కూడా ఆడేసుకున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులోకి రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ కూడా చేరింది. కారణం ఏంటంటే, సినిమాలో మాళవిక(Malavika Mohanan) కోసం కూడా డూప్ ను వాడారు.

Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి.. ఫొటోలు వైరల్

దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కి డూప్ వాడటం ఏంట్రా బాబు అంటూ మరోసారి ట్రోలింగ్ మొదలయ్యింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంది. ఆ సమయంలో మాళవిక కోసం తన డూప్ ను వాడాల్సి వచ్చింది. దీంతో, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయ్యాయి.

అయితే, తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించింది మాళవిక మోహనన్. “నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రాజాసాబ్ లో యాక్షన్ సీక్వెన్ చేశాను. అన్ని షాట్స్ నేనే చేశాను. కానీ, రిస్కీ షాట్స్ కోసం నా డూప్ ను వాడారు. యాక్టర్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలా డూపులను వాడటం అనేది సాధారణమే” అంటూ పోస్ట్ పెట్టింది మాళవిక. దీంతో మాళవిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇకనైనా రాజాసాబ్ సినిమాపై వస్తున్న ట్రోలింగ్ కి ఎండ్ కార్డు పడుతుందా అనేది చూడాలి.