Premalu 2 : చిన్న సినిమాల సీక్వెల్స్ సందడి.. ప్రేమలు 2 కూడా వచ్చేస్తుంది..

బాక్స్ ఆఫీస్ వద్దకి రాబోతున్న చిన్న సినిమాల సీక్వెల్స్. ప్రేమలు 2 కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.

Premalu 2 : ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న సినిమాలు వంద కోట్ల మార్క్ ని అందుకొని అదుర్స్ అనిపిస్తున్నాయి. తెలుగు నుంచి మ్యాడ్, టిల్లు స్క్వేర్, హనుమాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ నెంబర్స్ తో వావ్ అనిపిస్తే.. మలయాళం నుంచి మంజులం బాయ్స్, ప్రేమలు వంటి సినిమాలు నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టాయి.

కాగా ఈ సినిమాలు కేవలం భారీ విజయాన్ని నమోదు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దీంతో ఈ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం మేకర్స్ వాటికీ సీక్వెల్స్ ని తీసుకు వచ్చేస్తున్నారు. ఈక్రమంలోనే టిల్లు స్క్వేర్ ఆల్రెడీ ‘టిల్లు క్యూబ్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మ్యాడ్ మూవీకి కూడా సీక్వెల్ ని ప్రకటించారు.

Also read : Salaar : ‘సలార్’లో ప్రభాస్ నడిపిన బైక్ గెలుచుకోవాలని ఉందా.. అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనండి..

మ్యాడ్ స్క్వేర్ అంటూ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసారు. ఇక తాజాగా మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమలు’కు కూడా సీక్వెల్ ని ప్రకటించేసారు. 2025లో ప్రేమలు 2 రాబోతుంది అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసారు. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్స్.. ఫస్ట్ మూవీలా ఆడియన్స్ ని అలరించి ఆకట్టుకుంటాయా లేదా అనేది చూడాలి.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ గా ఆకట్టుకున్న ప్రేమలు అండ్ మ్యాడ్ సీక్వెల్స్ గురించి మేకర్స్ మాట్లాడుతూ.. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ని మరింత ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని, అందుకోసం కథ కథనం విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నామని, ఆడియన్స్ ని నిరాశపరచమని చెబుతున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా సీక్వెల్ ని తెరకెక్కించడంలో టిల్లు స్క్వేర్ మేకర్స్ బాగా సక్సెస్ అయ్యారు. మరి హనుమాన్, ప్రేమలు అండ్ మ్యాడ్ మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు