NBK109 : బాలయ్య మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో.. కాంబినేషన్ అదిరిపోయిందిగా..

బాలయ్య మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో, అలాగే ఆ హీరోయిన్ కూడా. కాంబినేషన్ మాత్రమే అదిరిపోయింది అంతే.

Malayala star hero in Nandamuri Balakrishna NBK109 movie

NBK109 : నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ నటసింహ దర్శకుడు బాబీతో తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ కథాంశంతో వేరే లెవెల్ లో ఉండబోతుందట. బాలయ్యని ఇప్పటివరకు చూపించినంత వైలెంట్ గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు బాబీ చెప్పుకొస్తున్నారు. ఈ కామెంట్స్ తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టుకొని మూవీలోని పలు యాక్షన్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇప్పటికి ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నటిస్తున్నాడంట. అలాగే ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్త కూడా వినిపిస్తుంది.

Also read : Rakul Preet Singh : పెళ్లి తరువాత భర్తతో కలిసి తొలిసారి.. ఇన్‌స్టా డాన్స్ రీల్ చేసిన రకుల్..

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారంట. ఈ విషయాన్ని చాందిని చౌదరినే స్వయంగా తెలియజేసినట్లు సమాచారం. దుల్కర్ అండ్ చాందిని మధ్య కొన్ని సీన్స్ ని కూడా ఆల్రెడీ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. లవర్ బాయ్ దుల్కర్, మాస్ గాడ్ బాలయ్య సినిమాలో నటిస్తున్నాడంటే.. అది అదిరిపోయే క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి.

కాగా ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని ఊటీలో జరిపారు. దాదాపు 20 రోజులు పాటు జరిగిన ఆ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించినట్లు బాబీ తెలియజేసారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గర పడడంతో బాలయ్య.. షూటింగ్ కి కొంచెం విరామం ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తీ అయిన మే నుంచి మళ్ళీ బాలయ్య సెట్స్ లోకి అడుగుపెడతారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు