Prasanth Narayanan : మలయాళ నటుడు ప్రశాంత్ నారాయణన్ మరణం..
ఈరోజు సినీ పరిశ్రమ మరో దుర్వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్ మరియు దర్శకుడు..
- gum 95921
- Published On : December 28, 2023 / 03:11 PM IST
Malayala Theater Artist and Director Prasanth Narayanan is passed away
Prasanth Narayanan : ఈరోజు ఉదయం తమిళ పరిశ్రమ నుంచి ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ తమిళ నటుడు, పొలిటికల్ లీడర్ విజయకాంత్ మరణం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే ఇదే రోజు మరో దుర్వార్త కూడా వినాల్సి వచ్చింది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్ మరియు దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ప్రశాంత్ నారాయణ.. 51 ఏళ్ళ నేడు తిరువనంతపురంలో మరణించారు.
Also read : కెప్టెన్ విజయ్‌కాంత్ గురించి 15 ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా?
రంగస్థలంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన నాటకాలకు తన రచన అందించిన ప్రశాంత్ నారాయణన్.. మలయాళ సూపర్ స్టార్ తో చాయాముఖి నాటకాన్ని కూడా చేశారు. తన నాటకాలతో ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ నారాయణన్.. ది సంగీత నాటకం అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఈయన మరణం పట్ల మలయాళ పరిశ్రమ దిగ్బ్రాంతి తెలియజేస్తుంది.
