కెప్టెన్ విజయ్‌కాంత్‌ గురించి 15 ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా?

కెప్టెన్ విజయ్‌కాంత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు..

కెప్టెన్ విజయ్‌కాంత్‌ గురించి 15 ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా?

Tamil Star Actor Politician Captain Vijayakanth Interesting Facts must Know about him

Captain Vijayakanth : ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చికిత్స అందుకుంటూ నేడు ఉదయం చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దీంతో విజయ్‌కాంత్‌ మరణం తమిళనాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.

దీంతో విజయ్‌కాంత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు, విజయ్‌కాంత్‌ సినిమాలు వైరల్ అవుతున్నాయి. కెప్టెన్ విజయ్‌కాంత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు..

# విజయ్‌కాంత్‌ అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. సినిమాల్లోకి వచ్చాక విజయ్‌కాంత్‌ గా పేరు మార్చుకున్నారు.

# మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరో అయ్యారు విజయ్‌కాంత్‌.

# మొదట్లో ఎక్కువగా విప్లవ భావాలు ఉన్న సినిమాలు చేసిన విజయ్‌కాంత్‌ ఆ తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మారిపోయారు.

# 1984లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేశారు విజయ్‌కాంత్‌.

# విజయ్‌కాంత్‌ దాదాపు 150కి పైగా సినిమాలు చేస్తే అందులో 20కి పైగా పోలీస్ పాత్రలు చేయడం విశేషం.

# విజయ్‌కాంత్‌ 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ భారీ హిట్ అవ్వడంతో ఆయనకి కెప్టెన్ బిరుదుగా స్థిరపడిపోయింది.

# విజయ్‌కాంత్‌ చేసిన పలు సినిమాలు టాలీవుడ్ లో కూడా రీమేక్ అయి విజయం సాధించాయి. మెగాస్టార్ ఠాగూర్ సినిమా కూడా విజయ్‌కాంత్‌ రమణ సినిమా రీమేక్.

# కష్టాల్లో ఉన్న సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్(నడిగర్ సంగం)కు ప్రసిడెంట్ అయి దాన్ని గాడిలో పెట్టారు. అసోసియేషన్ కి ఉన్న అప్పులు తీర్చారు.

# ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్ కి ఫస్ట్ హిట్ సెంతూరపాండిలో విజయ్‌కాంత్‌ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు.

# దర్శకుడిగా ఒక సినిమా, నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్‌.

# కెప్టెన్ టీవీ, కెప్టెన్ న్యూస్ అనే రెండు ఛానల్స్ ని స్థాపించారు.

# తమిళ్ లో తెరకెక్కిన తొలి 3D సినిమా అన్నై భూమిలో విజయ్‌కాంత్‌ హీరో.

# తన సినిమాలకు అనేక అవార్డులు అందుకున్నారు. 2001లో తమిళ ప్రభుత్వం అత్యున్నత అవార్డు కలైమామణి విజయ్‌కాంత్‌ కు ఇచ్చి సత్కరించారు. బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు కూడా అందుకున్నారు.

# 2005లో మధురైలో డీఎండీకే (దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీని స్థాపించారు విజయ్‌కాంత్‌. అయితే 2011 లో తప్ప మిగిలిన ఎప్పుడూ కూడా ఈ పార్టీ తమిళ రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది.

# విజయ్‌కాంత్‌ మూడుసార్లు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో వేర్వేరు ప్రాంతాల నుంచి పోటీ చేయగా రెండు సార్లు గెలిచి ఒకసారి ఓడిపోయారు.

Also Read : గొప్ప మానవతావాదిని కోల్పోయాం.. చిరంజీవి, మోడీతో సహా విజయ్‌కాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..