Kalidas Jayaram : ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న ఆ యంగ్ హీరో

ఏ ఇండస్ట్రీ చూసినా పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. హీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా నటుడు కాళిదాస్ తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

Kalidas Jayaram

Kalidas Jayaram : ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచిలర్ హీరోలంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మళయాళ హీరో కాళిదాస్ జయరామ్ తన గర్ల్ ఫ్రెండ్ తారిణి కళింగరాయర్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tamannaah Bhatia : తల్లితో కలిసి తమన్నా దీపావళి స్పెషల్ ఫొటోషూట్..

మళయాళ నటుడు జయరామ్ పార్వతీల కొడుకైన కాళిదాస్ హీరోగా పరీక్షించుకుంటున్నాడు. అయితే కొంతకాలంగా తమిళనాడుకి చెందిన మోడల్ తారిణితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 న వీరి నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో కాళిదాస్ తండ్రి జయరామ్, తల్లి పార్వతి, సోదరి మాళవిక కనిపించారు. ఈ ఏడాది వేలంటైన్స్ డే రోజు తమ ప్రేమ బంధం గురించి కాళిదాస్ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి కాళిదాస్, తారిణిలు తమ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

AR Rahman : కొత్త వివాదంలో ఏఆర్ రెహ్మాన్.. భగ్గుమన్న బెంగాలీలు

కాళిదాస్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘కొచ్చు కొచ్చు సంతోషంగళ్’ తో పాటు పలు మళయాళ, తమిళ సినిమాల్లో నటించారు. పుతం పుదు కాళై, పావ కాదైగల్‌లలో అతని నటనకు ప్రశంసలు అందుకున్నారు. కాళిదాస్ 2022 లో రిలీజైన ‘విక్రమ్’ లో కమల హాసన్ కొడుకుగా నటించారు. తారిణి 2019 లో మిస్ తమిళనాడుతో పాటు 2021 లో మిస్ యూనివర్స్ ఇండియా మూడవ రన్నరప్‌గా నిలిచారు. ‘షీ తమిళ్ నక్షత్రం అవార్డ్స్’ 2023 లో ఆమె ‘బెస్ట్ ఫ్యాషన్ మోడల్’ అవార్డును అందుకున్నారు.