మలయాళీ నటి వీణా నందకుమార్ ఓ ఇంటర్వూలో తనకు తాగుడు అలవాటు ఉందని చెప్పింది..
మలయాళీ ముద్దుగుమ్మ వీణా నందకుమార్ తనకు తాగుడు అలవాటు ఉందని తాజాగా వెల్లడించింది. అవును.. నేను తాగుతాను.. తాగడం ఏమైనా తప్పా.. అదేం పెద్ద నేరం కాదే.. అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తుంది. ‘నాకు మద్యం సేవించడమంటే చాలా ఇష్టం. అయితే తాగాక ఎవరినీ ఇబ్బంది పెట్టను కానీ కాస్త ఎక్కువగా మాట్లాడతానంతే’.. అంటూ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
‘నేను బీర్లు చాలా ఎక్కువగా తాగుతా. అది నేరమేమీ కాదు కదా.. తాగాక నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నేను తాగడం వల్ల ఎవరికీ నష్టం లేదు. కాబట్టి ఈ విషయంలో నన్ను కామెంట్ చేసే రైట్ ఎవరికీ లేదు. నేను నా వ్యక్తిగత అవసరం కోసం తాగుతున్నాను. అయినా ఈ రోజుల్లో తాగని వాళ్లెవరు..
అందరూ తాగుతున్నారు కదా.. సో, నేను కూడా అంతే. నా అలవాటు గురించి బయటకు చెప్పుకోవడానికి భయపడాల్సిన పని లేదు’ అని చెప్పింది. వీణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటి పట్ల వీణ ఎలా స్పందిస్తుందో చూడాలి.