×
Ad

Allu Arjun – Tovino Thomas : నేను స్కూల్‌లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ కేరళలో స్టార్.. బన్నీ, చిరుపై మలయాళం హీరో వ్యాఖ్యలు..

తాజాగా మలయాళం స్టార్ హీరో టొవినో థామస్‌ అల్లు అర్జున్ పై, మన తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

  • Published On : September 10, 2024 / 07:58 AM IST

Malayalam Hero Tovino Thomas Interesting Comments on Allu Arjun

Allu Arjun – Tovino Thomas : అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కి కేరళలో మాత్రం తన రెండో సినిమా ఆర్య నుంచే స్టార్ డమ్ వచ్చేసింది. అల్లు అర్జున్ అన్ని సినిమాలు మలయాళం లో కూడా డబ్ అయి రిలీజ్ అవుతాయి. కేరళలో కూడా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ సంఘాలు ఉన్నాయి. ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు అక్కడి ఫ్యాన్స్.

తాజాగా మలయాళం స్టార్ హీరో టొవినో థామస్‌ అల్లు అర్జున్ పై, మన తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టొవినో థామస్‌ తన 50వ సినిమా ARM తో సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. టొవినో థామస్‌ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ ఇక్కడ తెలుగులో కూడా చేసారు. తాజాగా ARM సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

Also Read : Chitra Shukla : తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం ఫోటోలు షేర్ చేసి..

ఈ ఈవెంట్లో టొవినో థామస్‌ తో యాంకర్ ముచ్చటిస్తూ మన హీరోల గురించి అడిగింది. ఈ క్రమంలో టొవినో థామస్‌ మాట్లాడుతూ.. నేను ఫస్ట్ చూసిన తెలుగు సినిమా చిరంజీవి సర్ జగదేకవీరుడు అతిలోక సుందరి. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆ సినిమా చూసాను. ఆ తర్వాత నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ సర్ ఆర్య సినిమా రిలీజయింది. ఆ సినిమా చూసాను. అప్పుడే కేరళలో అల్లు అర్జున్ సర్ స్టార్. ఆ తర్వాత అయన సినిమాలన్నీ అక్కడ రిలీజ్ అయ్యాయి, అన్ని చూసాను అని తెలిపారు.

ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. బాహుబలి సినిమా అయన తప్ప ఎవరూ చేయలేరు. ఆయన్ని అభిమానించని వారు ఎవరుంటారు అని అన్నారు. అలాగే RRR సినిమా ప్రచారంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కేరళ వచ్చినప్పుడు వాళ్ళని కలిసి మాట్లాడాను. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చాలా బాగా మాట్లాడతారు అని అన్నారు. దీంతో టొవినో థామస్‌ మన తెలుగు హీరోలపై మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇక అల్లు అర్జున్ మలయాళంలో స్టార్ హీరో అని మనకు తెలిసిందే. అదే విషయాన్ని మలయాళం హీరో వచ్చి చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.