Chitra Shukla : తల్లి కాబోతున్న హీరోయిన్.. సీమంతం ఫోటోలు షేర్ చేసి..
మధ్యప్రదేశ్ కి చెందిన ఈ భామ తాజాగా తన సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Chitra Shukla announced her Pregnancy with her Baby Shower Photos
Chitra Shukla : తాజాగా ఓ హీరోయిన్ తన సీమంతం ఫోటోలు షేర్ చేసి తల్లి కాబోతున్నట్టు తెలిపింది. హీరోయిన్ చిత్ర శుక్ల తెలుగులో మా అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది. ఇటీవల అహో విక్రమార్క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్ కి చెందిన ఈ భామ తాజాగా తన సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Sandeep Reddy Vanga – Jr NTR : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్.. ముంబైలో ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?
హీరోయిన్ చిత్ర శుక్ల మధ్యప్రదేశ్ కి చెందిన పోలీసాఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ లో వీరి పెళ్లి జరిగింది. తాజాగా సాంప్రదాయబద్దంగా తన సీమంతం వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ సీమంతం వేడుక జరిగింది. తన సీమంతం వేడుకకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారగా అభిమానులు, పలువురు నెటిజన్లు చిత్ర శుక్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.