Sandeep Reddy Vanga – Jr NTR : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్.. ముంబైలో ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?

ఫ్యాన్స్ అంతా దేవర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటో ఇచ్చాడు.

Sandeep Reddy Vanga – Jr NTR : సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్.. ముంబైలో ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో..?

Jr NTR Meets Sandeep Reddy Vanga in Mumbai for Devara Promotions Photo goes Viral

Updated On : September 9, 2024 / 3:22 PM IST

Sandeep Reddy Vanga – Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. రేపు దేవర ట్రైలర్ రిలీజ్ ఉండటంతో బాలీవుడ్ లో దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ నిన్నే ముంబై వెళ్ళాడు. ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అంతా దేవర ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సుహాస్.. మరో కొత్త సినిమా ‘గొర్రె పురాణం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

ఈ లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే ఫోటో ఇచ్చాడు. ముంబైలో ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగను కలిసాడు. సందీప్ రెడ్డితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఎన్టీఆర్ సందీప్ రెడ్డితో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ చేసాడని, ఆ ఇంటర్వ్యూ కోసమే ఇద్దరూ ముంబైలో కలిసాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Image

ఇదే కనక నిజమైతే ఎన్టీఆర్ – సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ వైరల్ అవ్వాల్సిందే. ఇక ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్ మాస్ గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తీయనున్నాడు.