Malayali Actress Shree Gopika Married Varundev in Guruvayur Temple
Shree Gopika : మలయాళీ భామ శ్రీ గోపిక తాజాగా వివాహం చేసుకుంది. 90ml, నాన్సెన్స్, వూల్ఫ్.. లాంటి పలు తమిళ, మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు టీవీలో కూడా నటించింది శ్రీ గోపిక.
గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న శ్రీ గోపిక కొన్నాళ్ల తర్వాత ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని విడిపోయారు. ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలు కూడా తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.
తాజాగా శ్రీ గోపిక వరుణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కేరళ గురువాయూర్ ఆలయంలో సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరిగింది.
శ్రీ గోపిక తన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకుంది.