Malla Reddy : ఆహా షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ పై పంచులే పంచులు.. ప్రోమో వైరల్..

తాజాగా మల్లారెడ్డి ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ షోకి గెస్ట్ గా వచ్చారు. (Malla Reddy)

  • Published on- April 26, 2026 / 02:02 PM IST

Malla Reddy

Malla Reddy : రాజకీయ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి తన స్పీచ్ లతో, విద్యాసంస్థలతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. మల్లారెడ్డికి సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కూడా కనిపిస్తారు మల్లారెడ్డి. తాజాగా మల్లారెడ్డి ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ షోకి గెస్ట్ గా వచ్చారు.

ఈ షోని సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ తన కామెడీతో, పంచులతో అందర్నీ మెప్పిస్తాడు. ఈ షోకి లేటెస్ట్ గా మల్లారెడ్డితో పాటు అలీ, శివాజీ కూడా హాజరయ్యారు. ఆహా సర్కార్ షోకి మల్లారెడ్డి వచ్చిన ప్రోమోని తాజాగా విడుదల చేసారు. ఈ షోలో మల్లారెడ్డి స్టెప్పులేశారు, సుధీర్ పై వరుసగా పంచులు వేశారు, తన పాపులర్ డైలాగ్స్ చెప్పారు.

Also Read : Vijay Deverakonda-Nani : విజయ్ దేవరకొండ, నాని మల్టీస్టారర్ ప్లాన్.!?

దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మల్లారెడ్డి ఇంకేం మాట్లాడాడో, ఇంకెంత సందడి చేసాడో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే. ఆహా సర్కార్ షోలో మల్లారెడ్డి వచ్చిన ఎపిసోడ్ ప్రోమోని మీరు కూడా చూసేయండి..