Mallepoola Pallaki Song : రవితేజ ‘ఇరుముడి’ నుంచి.. అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చేసింది..

మీరు కూడా ఇరుముడి సినిమా నుంచి మల్లెపూల పల్లకి సాంగ్ వినేయండి.. (Mallepoola Pallaki Song)

  • Updated on- August 16, 2026 / 08:15 PM IST

Mallepoola Pallaki Song

Mallepoola Pallaki Song : రవితేజ, ప్రియా భవాని శంకర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేశారు. రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తూనే యాక్షన్ కథ ఉండటం, సినిమాలో సాంగ్స్ బాగుండటం, అయ్యప్ప స్వామి ప్రైవేట్ ఆల్బమ్ మల్లెపూల పల్లకి సాంగ్ ఈ సినిమాలో ఉంటుంది అని ప్రకటించడంతో భారీ హైప్ నెలకొంది.

నేడు ఇరుముడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇరుముడి సినిమా నుంచి ప్రేక్షకులు, అయ్యప్పస్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న మల్లెపూల పల్లకి సాంగ్ ని తాజాగా విడుదల చేసారు. ఈ పాటకి థియేటర్స్ ఊగిపోవడం ఖాయం.

Also See : Irumudi : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూసేయండి..

మీరు కూడా ఇరుముడి సినిమా నుంచి మల్లెపూల పల్లకి సాంగ్ వినేయండి..