Malli Pelli Ott Release Date : అఫీషియల్ : రెండు ఓటీటీల్లో నరేశ్, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 21, 2023 / 04:33 PM IST
Malli Pelli
Malli Pelli Ott Release : టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరిద్దరి పరిచయం. పెళ్లి విషయాలనే కథగా తీసుకుని సినిమాని తెరకెక్కించడంతో విడుదలకు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే.. అంచనాలను అందుకోలేకపోయింది.
Malli Pelli : నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఎదరుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త. ఈ సినిమాని ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేయనున్నారో చెప్పేశారు. శుక్రవారం అంటే జూన్ 23న ప్రముఖ ఓటీటీలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా రెండింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. థియేటర్లలో పెద్దగా అలరించని సినిమాలు సైతం ఓటీటీలో రికార్డును సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరీ నరేశ్, పవిత్రల మళ్ళీ పెళ్లి ఓటీటీ అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంది అన్నది చూడాలి.
Lust Stories 2 Trailer : లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్!
అనన్య నాగళ్ళ, వనిత విజయ్ కుమార్, జయసుధ, అన్నపూర్ణమ్మ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల కన్నుమూసిన శరత్ కుమార్ (Sarath Kumar) ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ చిత్రాన్ని హీరో నరేష్ తన సొంత బ్యానర్ విజయ్ కృష్ణ సంస్థలో నిర్మించగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.
Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..
