Yatra 2 : యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి.. వైఎస్ జగన్ పాత్రలో జీవా..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy), వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) పాత్రలు ఉండబోతున్నాయి.
- Saketh U
- Published on- October 9, 2023 / 11:52 AM IST
Mammootty Jiiva Yatra 2 Movie First Look Released
Yatra 2 Movie : గతంలో 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాక జగన్ కి కూడా ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy), వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) పాత్రలు ఉండబోతున్నాయి. వైఎస్సార్ మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, జగన్ సీఎం ఎలా అయ్యాడు అనే దానిపై సినిమా ఉండబోతుందని సమాచారం. మొదటి పార్ట్ లో వైఎస్సార్ గా నటించిన మమ్ముట్టి(Mammootty) ఈ పార్ట్ లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా(Jiiva) నటిస్తున్నారు.
Also Read : Sreeleela : స్టేజిపై ఎమోషనల్ అయిన శ్రీలీల.. నాన్న వదిలేసి వెళ్లిన లోటుని గుర్తు చేసుకుంటూ బాలయ్య నాన్నలా..
తాజాగా నేడు యాత్ర 2 ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మమ్ముట్టి, జీవా ఇద్దరూ ఈ పోస్టర్ లో ఉన్నారు. ఇక ఈ పోస్టర్ లో.. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అనే డైలాగ్‌ను కూడా పెట్టడం గమనార్హం. ఇక ‘యాత్ర’ సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుదల అవ్వగా ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
