Allu Arjun : సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు.. అల్లు అర్జున్ పొలిటికల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేనేజర్..

తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. (Allu Arjun)

  • Published on- July 23, 2026 / 05:25 PM IST

Allu Arjun

Allu Arjun : ఇటీవల చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ డిప్యూటీ సీఎం అవ్వడం, విజయ్ సీఎం అవ్వడంతో చాలా మంది నటీనటులకు రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఎప్పట్నుంచో రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మామయ్య రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో ఉండటం కూడా ఈ ఊహలకు మరింత తోడైంది.

అల్లు అర్జున్ పొలిటికల్ వార్తలపై ఆయన టీమ్ నుంచి కానీ అల్లు కాంపౌండ్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Adire Abhi : టైటిల్ మార్చాము.. సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా.. జబర్దస్త్ అదిరే అభి కామెంట్స్ వైరల్..

శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ.. నేను ఒక వార్తకు సోషల్ మీడియాలో డైరెక్ట్ గానే రిప్లై ఇచ్చాను. అవన్నీ ఫేక్ న్యూస్ అని. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. అలాంటి ఆయన ఇప్పుడు కరెంటు లైనప్ లో ఇన్ని సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు. అసలు రావాల్సిన అవసరం ఏముంది. ఆయన ఫోకస్ అంతా ప్రస్తుతం సినిమాలే. ఆయన ది బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో. వాళ్ళ మామయ్య ద్వారా వస్తారు అనే వార్తలు కూడా ఫేక్ న్యూస్. అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలకు నెక్స్ట్ పదేళ్లు చాలా బిజీగా ఉన్నారు. అవి వదిలేసి ఎందుకు వస్తారు రాజకీయాల్లోకి అని అన్నారు.

దీంతో అల్లు అర్జున్ ఇప్పటికైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు ఏవి లేవని, అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చింది.