Manchu Lakshmi : బాలయ్య బాబు పేరు చెప్పి ఊరందర్నీ మోసం చేసిన మంచు లక్ష్మి..

తాను నిర్మాతగా, హీరోయిన్ గా చేసిన గుండెల్లో గోదారి సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన తెలిపింది. (Manchu Lakshmi)

  • Published On : April 7, 2026 / 06:13 PM IST

Manchu Lakshmi

Manchu Lakshmi : మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ముంబైకి షిఫ్ట్ అయింది. ఇటీవలే తన కూతురు ఓణీల వేడుకను ఘనంగా చేసి వైరల్ అయింది. తాజాగా మంచు లక్ష్మి రాజా రవీంద్ర యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.

ఈ ప్రోమోలోనే లక్ష్మి చెప్పిన బోలెడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాను నిర్మాతగా, హీరోయిన్ గా చేసిన గుండెల్లో గోదారి సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన తెలిపింది.

Also Read : Vijay Rashmika : రష్మిక సొంతూళ్లో రిసెప్షన్.. కొడవ సాంప్రదాయంలో.. ఫోటోలు..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. వెస్ట్ గోదావరి లో షూటింగ్ చేస్తున్నాము. మాకు ఒక మూడొందల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. మా దగ్గర 30 మందే ఉన్నారు. 300 మందిని ఎక్కడ్నుంచి తీసుకురావాలి అనుకున్నా. నా ప్రొడ్యూసర్ బ్రెయిన్ ఉపయోగించా. ఊళ్ళో బాలయ్య బాబు వస్తున్నాడు అని పుకారు పుట్టించా. దాంతో మా షూటింగ్ స్పాట్ కి ఏకంగా 3000 మంది ఊరు ఊరంతా వచ్చారు. మేము కెమెరా ఎలా పెట్టినా, ఎటు వైపు పెట్టినా ఫుల్ జనాలే ఉన్నారు అని చెప్పుకొచ్చింది.

అలా మంచు లక్ష్మి బాలయ్య బాబు పేరు చెప్పి ఊరందర్నీ మోసం చేసి తన షూటింగ్ లో వాడుకుంది. ఈ ఇంటర్వ్యూలో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చెప్పిందో అని ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Bollywood : షూస్ చింపుకున్న సల్మాన్.. కోటు చింపుకున్న అక్షయ్.. చిరగడమే బాలీవుడ్ ఫ్యాషన్..