Manchu Lakshmi : మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. రాజ్యసభ ఎంపీ.. పాలిటిక్స్ లోకి మంచు లక్ష్మి.. కామెంట్స్ వైరల్..

తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాలిటిక్స్ లోకి తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Manchu Lakshmi)

  • Updated on- April 28, 2026 / 12:48 PM IST

Manchu Lakshmi

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి నటిగా ప్రూవ్ చేసుకోవాలని సినిమాలు చేస్తుంది. మరో పక్క టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మోహన్ బాబు ఫ్యామిలీకి ఉన్న రాజకీయ పరిచయాలు, మంచు లక్ష్మి కాంటాక్ట్స్ తో తను కూడా పాలిటిక్స్ లోకి వస్తుందని రూమర్స్ వచ్చాయి గతంలో.

తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాలిటిక్స్ లోకి తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Manchu Lakshmi : సిద్దార్థ్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది.. మగ అహంకారం.. మంచు లక్ష్మి వ్యాఖ్యలు వైరల్..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను నరేంద్ర మోదీ గారిని డైరెక్ట్ గా కలవగలను. నాకు రాజ్యసభ ఇస్తే ఎంపీగా తీసుకుంటాను కానీ పోటీ చేసే అంత ఖాళీ లేదు. నా గురించి పాలిటిక్స్ విషయంలో ఎవరికి వాళ్ళే రాసేశారు. నేను చేసిన సేవా కార్యక్రమాలు, స్కూల్స్ గురించి, ఇల్లు కట్టించడం, చెత్త క్లీన్ చేయడం.. ఇవన్నీ చూపించరు. నేను చేసే పనుల వల్ల పాలిటిక్స్ లోకి వస్తారు అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఫలానా పార్టీ అని కూడా రాసారు.

కానీ చాలా మంది నేను చేసే పనులు చూసి నన్ను అడిగారు నువ్వు రాకపోతే రాజకీయాల్లోకి ఇంకెవరు వస్తారు. సిస్టమ్ లోపల ఉంటే ఇంకా చేయొచ్చు అని చెప్పారు. అందుకే భవిష్యత్తులోకి రాజకీయాల్లోకి వస్తానేమో అని తెలిపింది.

Also Read : Manchu Lakshmi : లక్ష్మి పార్వతి నాకు, అంకుల్‌కి తినిపించేది.. వామ్మో మంచులక్ష్మి ఎన్టీఆర్‌కి ఇంత క్లోజా? ఏం చెప్పిందంటే..