×
Ad

Manchu Lakshmi : నేను హాలీవుడ్ యాక్టర్‌ని.. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు.. హాలీవుడ్‌లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని..

తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్(Tollywood)లో సంచలనంగా మారాయి.

  • Published On : July 6, 2023 / 11:14 AM IST

Manchu lakshmi says she is Hollywood actor she wants to go Hollywood again

Manchu Lakshmi :  మోహన్ బాబు(Mohan Babu) కుమార్తెగా మంచు లక్ష్మి అందరికి పరిచయమే. నటిగా, యాంకర్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా(America)లో సెటిలై, అక్కడ కొన్ని సినిమాల్లో నటించి ఇక్కడికి వచ్చింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి స్పీచ్ లను ట్రోల్స్ చేసినా కూడా పట్టించుకోదు. అప్పుడప్పుడు మంచు లక్ష్మి తన స్పీచ్ లతోనే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్(Tollywood)లో సంచలనంగా మారాయి.

మంచులక్ష్మి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హాలీవుడ్(Hollywood) యాక్టర్ ని, అక్కడ కొన్ని సినిమాలు చేశాను. అక్కడే ఉంటే ఈ పాటికి స్టార్ అయ్యేదాన్ని. కానీ పాప కోసం, ఫ్యామిలీ దగ్గరగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా అవకాశం వస్తే కచ్చితంగా మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళిపోతాను. ఈసారి మాత్రం వెళ్తే తిరిగి రాను. ఇక్కడ చాలా కష్టపడ్డాను. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వరు. మధుశాలిని, బిందు మాధవి, నిహారిక, శివాని.. ఇలా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఛాన్సులు లేవు. ఆడియన్స్ కూడా బయటి అమ్మాయిలనే చూస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తేనే చూస్తున్నారు అని అంది.

Pathaan : ఆ దేశంలో రిలీజ్‌కి రెడీ అయిన పఠాన్.. RRR రికార్డు బద్దలుకొడుతుందా?

మరి మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వొచ్చు కదా అని అడగగా.. నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, కానీ నేను ఎంతమందికి ఇవ్వగలను, నాకే సరైన ఛాన్సులు లేవు, ఇంక నేనెలా ఇవ్వగలుగుతాను అని తెలిపింది. దీంతో మంచులక్ష్మి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.