Balakrishna : బాలయ్య ఆ మాట చెప్పగానే ఏడ్చేసాను.. అవన్నీ బయటకు రావు.. మంచు లక్ష్మి కామెంట్స్..

ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆ సినిమా గురించి, బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Balakrishna)

  • Published on- April 28, 2026 / 01:37 PM IST

Balakrishna

Balakrishna : మంచు లక్ష్మి నటిగా సినిమాలు చేయడమే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించింది. మంచు లక్ష్మి నిర్మాణంలో బాలకృష్ణ, మంచు మనోజ్ హీరోలుగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే ఓ ప్రయోగాత్మక సినిమా చేసారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆ సినిమా గురించి, బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Manchu Lakshmi : మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. రాజ్యసభ ఎంపీ.. పాలిటిక్స్ లోకి మంచు లక్ష్మి.. కామెంట్స్ వైరల్..

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. బాలయ్య బాబు చాలా మంచి మనిషి. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటారో వంద మందిలో కూడా అలాగే ఉంటారు. ఆయన మాకు చాలా సపోర్ట్ చేసారు ఆ సినిమా టైంలో. ఒక రోజు రాత్రి షూటింగ్ లో గుర్రం మాట వినకపోతే నైట్ అంతా అలా ఉన్నారు షూట్ లో. తెల్లారి బోయపాటి సినిమా షూట్, అది చేసొచ్చి మళ్ళీ వచ్చారు. అసలు కోపం కూడా తెచ్చుకోలేదు. ఆ సినిమా చేస్తున్నపుడు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉండేది. సుహాసిని గారికి జ్వరం, నాకు అల్సర్. బడ్జెట్ పెరిగిపోయింది. ఇలా ఏదో ఒకటి ఉండేది.

ఆయనకు ముందే ఒక రెమ్యునరేషన్ అనుకోని మాట్లాడుకున్నాం. ఓ రోజు మేకప్ వేసుకుంటుంటే వెళ్లి ఆయన పక్కన కూర్చున్నాను. బడ్జెట్ సంగతి తెలిసి నాతో రెమ్యునరేషన్ అంత వద్దు అని తగ్గించుకొని చిన్న అమౌంట్ చెప్పి అది ఇవ్వు చాలు అన్నారు. ఆయన అన్న ఆ మాటకు నేను ఏడ్చేసాను. అంత సపోర్ట్ చేసారు. ఆయనకు మా ఫ్యామిలీ మీద, నాన్న గారి మీద ఉన్న రెస్పెక్ట్ అది. ఆ సినిమా షూటింగ్ లో కూడా ఒక ఊళ్ళో షూట్ చేస్తే ఆయన్ని చూడటానికి వచ్చిన 300 మందికి ఫొటోలు ఇచ్చారు. శ్రీమన్నారాయణ సినిమాకు కూడా నిర్మాతకు కష్టం అని తెలిసి రెమ్యునేషన్ తగ్గించుకున్నారు. ఇవన్నీ బయటకు రావు. ఆయన కొట్టాడు, తిట్టాడు అనే మాట్లాడతారు అని తెలిపింది.

Also Read : Manchu Lakshmi : సిద్దార్థ్ వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది.. మగ అహంకారం.. మంచు లక్ష్మి వ్యాఖ్యలు వైరల్..