Manchu Lakshmi : లక్ష్మి పార్వతి నాకు, అంకుల్‌కి తినిపించేది.. వామ్మో మంచులక్ష్మి ఎన్టీఆర్‌కి ఇంత క్లోజా? ఏం చెప్పిందంటే..

సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపింది.(Manchu Lakshmi)

  • Published on- April 28, 2026 / 11:39 AM IST

Manchu Lakshmi

Manchu Lakshmi : మోహన్ బాబు కూతురిగా అందరికి పరిచయం అయినా నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తుంది మంచు లక్ష్మి. ఇప్పుడు ముంబై కూడా షిఫ్ట్ అయి బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ట్రై చేస్తుంది. మంచు లక్ష్మి తాజాగా నటుడు రాజా రవీంద్ర యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపింది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో సినిమాలు చేసారు. మోహన్ బాబు ఎన్టీఆర్ తో కలిసి అనేక సినిమాల్లో పనిచేసారు. ఇలా మోహన్ బాబు పిల్లలు ఎన్టీఆర్ కి దగ్గరయ్యారు.

Also See : Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి క్యూట్ ఫొటోలు.. ఎంత అందంగా ఉందో..

ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను రెగ్యులర్ గా ఆయన ఇంటికి వెళ్లేదాన్ని. అంకుల్ అని పిలుస్తా. చాలా క్లోజ్ ఆయనకు. మా ఇంటికి వెళ్ళినట్టే వాళ్ళింటికి వెళ్లేదాన్ని సీఎం అయ్యాక కూడా. నేను వెళ్ళినప్పుడల్లా పెద్ద గ్లాస్ నిండా పాలు ఇచ్చేవాళ్ళు. అవి తాగడానికి కష్టపడేదాన్ని. లక్ష్మి పార్వతి గారు కూడా నన్ను చిన్న పిల్లలా బాగా చూసుకునేవాళ్ళు. రాత్రి పూట డిన్నర్ టైంకి వెళ్తే ఆవిడే అన్నం కలిపి ఎన్టీఆర్ గారికి, నాకు తినిపించేవాళ్ళు. ఒకసారి నా బర్త్ డేకి బంగారం, డైమండ్స్ ఉన్న రింగ్ గిఫ్ట్ ఇచ్చారు. సీఎం నాకు గిఫ్ట్ ఇచ్చారని అందరూ కుళ్ళుకున్నారు.

ఒకసారి నేను ఇంటర్ చదివేటప్పుడు క్లాస్ లో మీకు పొలిటీషియన్స్ ఎవరైనా తెలుసా అంటే నేను ఎన్టీఆర్ గారు తెలుసు అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. నేను మా క్లాస్ అందరిని ఆల్మోస్ట్ ఒక 50 మందిని ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి అందరికి ఆటోగ్రాఫ్స్ ఇప్పించాను. ఆయన అందరికి ఫుడ్ పెట్టించారు. ఆయనతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అని సీనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది.

Also Read : Tollywood : డీజిల్ కొరత ఎఫెక్ట్.. టాలీవుడ్ షూటింగ్స్ కి అంతరాయం..