Manchu Manoj-Bhuma Mounika: రాజకీయాల్లోకి మంచు మనోజ్ భార్య.. వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఏ పార్టీ నుంచి..?

Bhuma Mounika Political Entry: మంచు మనోజ్ కి అన్ని పార్టీలలోనూ సన్నిహితులు ఉన్నారు. మనోజ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది. (Manchu Manoj)

  • Updated on- May 19, 2026 / 04:10 PM IST

Manchu Manoj Wife Bhuma Mounika Entry Into Politics

Manchu Manoj-Bhuma Mounika : మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య భూమా మౌనికతో కలిసి రెగ్యులర్ గా కనిపిస్తాడు మనోజ్. భూమా మౌనిక పలు బిజినెస్ లు కూడా నిర్వహిస్తుంది. ఇటీవలే మనోజ్ తన భార్యతో కలిసి “ఐక్య ధైర్య సేన సమితి” అనే సామాజిక సేవా సంస్థని ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థుల చదువుకి సహాయం చేయడం.. వంటి పనులు చేయనున్నారు.

తాజాగా మనోజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడారు. మంచు మనోజ్ కి అన్ని పార్టీలలోనూ సన్నిహితులు ఉన్నారు. మనోజ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది.

Also Read- Pawan Kalyan : శస్త్ర చికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. గడ్డం తీసేసి.. ఫొటోలు..

ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. నా భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మేము పెట్టిన సంస్థ కేవలం సేవా కార్యక్రమాల కోసమే. అది ఏ పార్టీకి చెందినది కాదు. త్వరలో రాజకీయాల్లో భాగమవుతాము. అధికారికంగా మేమే ప్రకటిస్తాము అని తెలిపారు.

దీంతో మనోజ్, తన భార్య మౌనిక ఏ పార్టీలోకి వెళ్తారు అని చర్చగా మారింది. మనోజ్ భార్య భూమా మౌనిక తల్లితండ్రులు దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభారెడ్డి టీడీపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసారు. ప్రస్తుతం మౌనిక అక్క భూమా అఖిలప్రియ కూడా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆవిడ కూడా మంత్రిగా పనిచేసింది. ఇక మంచు ఫ్యామిలీకి వైసీపీలో సన్నిహితులు ఎక్కువ. మనోజ్ కి జనసేనపై మక్కువ ఉంది. గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్, జనసేనని పొగిడారు. మరి ఈ పార్టీల్లో మనోజ్ భార్య ఏ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో చూడాలి.