×
Ad

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ చూశారా? ఓ నమః శివాయ.. అదిరిపోయిందిగా..

తాజాగా నేడు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో 'కన్నప్ప' సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

  • Published On : November 23, 2023 / 07:45 AM IST

Manchu Vishnu Kannappa Movie Title Poster Released on Vishnu Birthday

Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. మోహన్ బాబు (Mohan Babu) దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటించబోతున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ సినిమాకి అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేస్తున్నారు. అప్పట్లో వాడిన ఆయుదాలు, పోరాటల నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కన్నప్ప సినిమా నుంచి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా నేడు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో ‘కన్నప్ప’ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు..

ఈ పోస్టర్ లో అడవుల్లో మంచు విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు వేస్తున్నాడు. వెనుక కొండలు, జలపాతాలతో శివలింగం ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. దీంతో పోస్టర్ అదిరిపోయింది. కన్నప్ప టైటిల్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశారు. దేవుడ్ని నమ్మని ఓ వేటగాడు శివుడికి వీర భక్తుడిగా ఎలా మారాడు అని అర్ధం వచ్చేలా ఓ సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. దీంతో మంచు విష్ణు కన్నప్ప పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కన్నప్ప పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి, పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుందని సమాచారం.