Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు..
కన్నప్ప’ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.

Hollywood Action Choreographer Kecha Khamphakdee Working for Manchu Vishnu Kannappa Movie
Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు భక్త కన్నప్ప సినిమాని మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ‘కన్నప్ప’ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు (Mohan Babu) దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. కన్నప్ప కోసం అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెచా’ వర్క్ చేయబోతున్నారు. బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులకు కెచా ఫైట్స్ కంపోజ్ చేశారు.
Also Read : Varun Lavanya : ఇటలీలో పెళ్లి వేడుకలు ముగించుకొని.. మెగా ఫ్యామిలీతో సహా హైదరాబాద్ తిరిగొచ్చిన కొత్త జంట..
ఇప్పుడు కన్నప్ప సినిమా కోసం కెచా ప్రాచీన యుద్దాలను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. అప్పట్లో వాడిన ఆయుదాలు, పోరాటల నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో కెచా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ల కోసం థాయ్ లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లను కూడా కన్నప్ప సెట్స్ కి తీసుకువచ్చారని సమాచారం.
Get ready for a heart-pounding spectacle as Kecha Khamphakdee, the action maestro, joins the ‘Kannappa’ family! Expect an unparalleled cinematic Tandav like never before. ??#KechaKhamphakdee @iVishnuManchu @24FramesFactory @avaentofficial pic.twitter.com/Bok2LP1BUm
— Kannappa The Movie (@kannappamovie) November 4, 2023